Saturday, 5 June 2021

నా జీవితం మలుపు తిరిగిన సంఘటన! | A Journey from Slow Learning to Best Teaching | Story of Venkatesh Gajula

 నా జీవితం మలుపు తిరిగిన సంఘటన! Venkatesh Gajula, SGT, MPPS Uppununthala Boys.

19 సంవత్సరాల క్రితం 2002 మే నెల వేసవి సెలవుల్లో అచ్చంపేటలో మా చిన్నమ్మ ChandraKala AR బాబాయ్ రఘుమయ్య టీచర్ వాళ్ళ దగ్గర ఒక నెల పాటు ఉండి 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ వెళ్లి అక్కడ బేసిక్స్ నేర్చుకోవడం(ఇక్కడ నా మిత్రుడు Venkat Yadav తో doubts చర్చించేవాడిని) ద్వారా 9వ తరగతి వరకు ఇంగ్లీష్ & గణితంలో బార్డర్ మార్కులతో పాస్ అవుతూ వచ్చిన నేను 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇంగ్లీషులో 83, గణితంలో 99 మార్కులు తెచ్చుకోగలిగాను.

ఆ సంవత్సరం మా పాఠశాల TSWRS&JC Lingal లో గణితంలో ఇవే అత్యధిక మార్కులు.

ఆ సంవత్సరమే ఉద్యోగంలో చేరిన గణిత ఉపాధ్యాయులు Narsimha Gudelli సార్ బాగా ప్రోత్సహించేవారు.

9వ తరగతిలో గణితం అర్థంకాక వేరే వాళ్ళ నోటు పుస్తకాలు తీసుకుని చేసిన నేను పదో తరగతిలో మా మిత్రులకు ఎంతో మందికి గణితం అర్థమయ్యేలా చెప్పేవాడిని.

ఈ సంఘటన నా జీవితంలో గొప్ప మార్పు తీసుకువచ్చింది.


అదే విధంగా TSWRS&JC Achampet లో ఇంటర్ సెకండియర్ చేసేటప్పుడు మా గణిత లెక్చరర్ రామచంద్ర రెడ్డి సారు నాతోపాటు ముగ్గురు నలుగురు మిత్రులతో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ చెప్పించే వారు.

అలా నేను మా జూనియర్స్ కి మ్యాథ్స్ నాలుగు చాప్టర్లు చెప్పాను.

ఇలా టీచింగ్ చేయడంలో పొందే ఆనందం,తృప్తి ఆస్వాదించగలిగాను.

ఇంగ్లీష్, గణితం లలో బేసిక్స్ నేర్చుకోవడం ద్వారా నా ఎడ్యుకేషన్‌లో వచ్చిన మార్పు ఇంకా నాలాంటి ఎంతోమంది ఎడ్యుకేషన్ లో మార్పు రావాలని నా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత 2006 మే నెలలో అంటే 15 సంవత్సరాల క్రితం మా గ్రామం మాధవాని పల్లిలో GVNLD Tutorial(మా నాన్న అమ్మ గారి పేరునా గాజుల వీరనారాయణ&లక్ష్మీ దేవి టుటోరియల్) పేరునా ఉచిత ఇంగ్లీష్ గ్రామర్ మరియు 10వ తరగతి అడ్వాన్స్ మ్యాథ్స్ బోధించడం ప్రారంభించాను. అలా ప్రతి వేసవి సెలవులలో నాకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేవరకు(2010) నాలుగు సంవత్సరాల పాటు ఈ ఉచిత బోధన కొనసాగించాను.

ఈ బోధనలో ఈ రోజు చెప్పిన విషయాన్ని రేపు స్లిప్ టెస్ట్ నిర్వహించే వాడిని. ఇలా ప్రతిరోజు స్లిప్ టెస్ట్ వారానికి వీక్లీ టెస్ట్ కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అప్పటి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు అంజమ్మ గారితో & విద్యా కమిటీ చైర్మన్ గౌరవనీయులు గాజుల చెన్నకిష్టయ్య గారితో బహుమతులు ఇప్పించాను.


జ్ఞానం వికసించాలంటే గ్రంథాలయం అవసరం అని గ్రహించి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ లోనే 2013 అక్టోబర్ లో నాతో పాటు తమ్ముళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు Chennakeshavulu Kunda, Venkatesh Kunda గారి ఆర్థిక సహకారంతో అవసరమైన పుస్తకాలను సేకరించి గ్రామ పెద్దలు & యువకుల సహకారంతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

2006-08 లో మహబూబ్ నగర్ ప్రభుత్వ డైట్ కళాశాలలో 71 మార్కులతో సీటు పొంది డి.ఎడ్ కోర్స్ పూర్తి చేసి 2008 డిఎస్సీ ద్వారా 70 మార్కులతో ఓపెన్ కాటగిరీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించి తుమ్మన్ పేట ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యాను.

ఇక్కడ సుమారు 6 సంవత్సరాల పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కృషి చేశాను.ఇక్కడ ఉన్నప్పుడే ఇన్ సర్వీసులో 2015-17 లో బి.ఎడ్ పూర్తి చేశాను.

ఆదునిక కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని 2017 మే నెలలో Tenses Spoken English వీడియోలు రూపొందించి venkatbta యూట్యూబ్ చానెల్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.

https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS1PmNrSaru5205RvSTNVDOC

ఈ వీడియోలకు సుమారు లక్ష యాబై వేల views వచ్చాయి.

ఇంగ్లీష్, గణితం తో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా చాలా కీలకమైనది కాబట్టి 2018 మే నెల వేసవి సెలవుల్లో మళ్ళీ మా గ్రామంలో సమత కంప్యూటర్స్ పేరునా మా ఇంటి వద్దే ఉన్న ఒక రూమ్ లోనే మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను మా తమ్ముడు Shankar Gajula ఉచిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది.
ఉచిత కంప్యూటర్ శిక్షణను మా అమ్మ నాన్న ప్రారంభించారు:

https://youtu.be/6tY-p7n5twU

ఉచిత కంప్యూటర్ శిక్షణపై గ్రామ పెద్దలు & యువకులు స్పందన:

https://youtu.be/F36AJPrd0Mg

2018 లో CCE Grading Excel Software ని విద్యార్థులకు వచ్చిన మార్కులతో అన్ని రకాల Grading Report లు వచ్చేటట్లు తయారు చేసి www.venkatbta.com వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరిగింది.

https://www.venkatbta.com/2018/10/new-cce-grading-reports-software-v14_55.html

ఈ సాఫ్ట్‌వేర్ ని ఎలా ఉపయోగించాలో వీడియోను యూట్యూబ్ ఉంచడం జరిగింది.

https://youtu.be/yXRea1gL5Ps

ఈ CCE Grading Software ఉపయోగించడం వల్ల All CCE Grading Reports పొందటంతో పాటు ఉపాధ్యాయుల విలువైన సమయం ఆదా అవుతుంది అదేవిధంగా విద్యార్థుల గ్రేడింగ్ రిపోర్ట్ లు అన్ని ఉపాధ్యాయుల మొబైల్ లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

వీటిని సుమారు పది వేల మందికి పైగా చూశారు. చాలా మంది ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటున్నారు.

2018 జూలై లో ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలకు బదిలీ కావడం జరిగింది.

ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉండింది.

హెడ్మాస్టర్ Laxminarayana Kalmula సార్ & నాతో పాటు స్టాఫ్ బాలమణి మేడం, Srinivas Manopadu సార్ అందరం కలిసి టీం వర్క్ తో పాఠశాల పరిస్థితిని మార్చి పిల్లల సంఖ్యను పెంచే ప్రయత్నం చేశాం.

అదేవిధంగా 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు ప్రత్యేక తరగతులు నిర్వహించాము.In Academic Monitoring Team at Mandal Level 

In Academic Monitoring Team at Mandal Level


V TGCET 2019 లో ఐదుగురిని ఎక్జామ్ రాపిస్తే నలుగురికి సీట్లు వచ్చాయి.


హెడ్మాస్టర్ సార్ తన ఇంటి వద్ద ఉన్న కంప్యూటర్ ను పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది.

విద్యార్థులకు కంప్యూటర్ తో డిజిటల్ భోధన చేస్తూ ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. 


స్థానిక సర్పంచ్ కట్టా సరిత మేడంగారి సహకారంతో పాఠశాలకు రంగులు వేయించి పాఠశాలను చాలా సుందరంగా తయారు చేయించాము.

నాడు: MPPS UPPUNUNTHALA BOYS

నేడు: MPPS UPPUNUNTHALA BOYS


మా పాఠశాలలో సీట్లు వచ్చిన విషయం తెలుసుకొని మా స్వంత చెల్లెలు కొడుకు అంటే మా మేనల్లుడు వరప్రసాద్ ను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మా పాఠశాలలో చేర్పించారు. మా అల్లుడు మా దగ్గరే ఉండి నాతో పాటు పాఠశాలకు వచ్చి చదువుకునేవాడు.

యం.వరప్రసాద్


ఇంటి వద్ద నా జీవిత భాగస్వామి భౌతిక మా అల్లుడిని చదివిపించేది.

2020 మార్చిలో కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. ఏప్రిల్ లో గురుకుల 5వ తరగతి ప్రవేశాల కోసం venkatbta యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. 

https//www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS0FJbp_DuBv-8uXlsJb86mw

ఈ వీడియోలకు లక్ష views వచ్చాయి.

V TGCET 2020 లో కూడా ఐదుగురిని ఎక్జామ్ రాపిస్తే మా అల్లుడితో పాటు మరో ఇద్దరికీ సీట్లు వచ్చాయి అంటే మొత్తం మూడు సీట్లు వచ్చాయి.


మా అల్లునికి సీటు వచ్చినందుకు మా వాళ్ళాందరూ చాలా సంతోష పడ్డారు.

కరోనా వల్ల 2020 మార్చి నుండి ఇప్పటి వరకు విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు.

గురుకుల పాఠశాలల్లో చదువుకొని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన నేను నా జీవిత భాగస్వామి భౌతికతో కలిసి ఈ వేసవి/కరోనా సెలవుల్లో 2021 మే 21న మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ఉచిత ఆన్‌లైన్ తరగతులను గౌరవనీయులు బల్మూర్, అచ్చంపేట & ఉప్పునుంతల మండలాల విద్యాధికారి Rama Rao Ramavath సార్ & ఉప్పునుంతల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ Hanumanth Reddy సార్ ల చే ప్రారంభించాము.https://youtu.be/gaCC_KvKX3w

ఈ ఆన్‌లైన్ తరగతుల్లో ప్రత్యేకత ఏందంటే ఎవ్వరైనా ఎక్కడి నుండైనా క్లాస్ లో జాయిన్ కావచ్చు వారి ఇంట్లో ఉండే చూడొచ్చు అదేవిధంగా మనం చెప్పే వీడియో&డిజిటల్ డిస్ప్లే పైన రాసిన అక్షరాలు విద్యార్థులకు కనిపిస్తాయి, అదేవిధంగా విద్యార్థులు మనకు కనిపిస్తారు, విద్యార్థులతో మనము ప్రత్యక్షంగా ఇంటరాక్టివ్ కావచ్చు, వారు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే మనల్ని అడిగి లైవ్‌లో నివృత్తి చేసుకోవచ్చు.ఉచిత ఆన్లైన్ తరగతులు:

కింది లింక్ పైన క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

Microsoft Teams App Link: https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams;

ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు & మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్ ఉంటుంది.

ఈ సమయానికి కింది లింక్ పై క్లిక్ చేసి Microsoft Teams ఆప్ ని సెలెక్ట్ చేసుకుని మీ పేరు ఎంటర్ చేసి ఆన్లైన్లో క్లాస్ లో జాయిన్ కావాలి.

Online Class Link:

https://teams.live.com/meet/95518301262533

venkatbta యూట్యూబ్ చానెల్ ద్వారా విద్యా,ఉద్యోగ,ఉపాధి& టెక్నాలజీ విషయాల్లో ప్రజలను Educate చేయడం జరుగుతుంది.

https://youtube.com/c/venkatbta

ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే డిపార్ట్‌మెంట్ పరీక్షలు పాస్ కావల్సి ఉంటుంది. వీటిపై సరైన అవగాహన లేక ఇవి పాస్ కాలేక మళ్ళీ మళ్ళీ ఈ పరీక్షలు రాస్తూ ఉంటారు ఇవి పాస్ కానందుకు కొంత మంది ప్రమోషన్ కోల్పోయిన వారు ఉంటారు. నేను ఈ పరీక్షలు పాసైన తర్వాత ఓకే సారి ఈ డిపార్ట్‌మెంట్ పరీక్షలు ఎలా పాస్ కావాలి అని 2018 డిసెంబర్ లో వీడియో చేసి యూట్యూబ్ చానెల్ లో ఉంచడం జరిగింది.

https://youtu.be/0kE9pq1Hw5o

ఈ వీడియోకు సుమారు లక్ష views వచ్చాయి.

చాలా మంది ఈ వీడియో చూసి మేము ఒకే సారి పాస్ అయ్యామని కామెంట్స్ ద్వారా ఫోన్ ద్వారా తెలిపినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. 

ఈ ఆనందాన్ని వెలకట్టలేము.

2015 జనవరిలో కంప్యూటర్ లో Anu Script Manager తో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో ఇంటర్నెట్ ద్వారా స్వయంగా నేర్చుకొని తర్వాత సులభంగా ఎలా తెలుగు టైపింగ్ చేయాలో చార్ట్ తయారు చేసి www.venkatbta.com వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరిగింది.

ఆపిల్ కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్:

https://www.venkatbta.com/2017/03/anu-script-manager-70-apple-key-board.html

రోమా కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్:

https://www.venkatbta.com/2017/03/anu-script-manager-70-roma-key-board.html

వీటిని ఇప్పటి వరకు లక్ష ఎనబై వేల మంది చూశారు.

అదేవిధంగా 2017 లో తెలుగు టైపింగ్ సులభంగా ఎలా చేయాలో రెండు వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడితే ఇప్పటి వరకు వాటిని యాభైవేల మంది చూశారు.

ఆపిల్ కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్ వీడియో:

https://youtu.be/sXnVl3bDORI

రోమా కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్ వీడియో:

https://youtu.be/Ki75CLZ_eqw

ప్రతి రోజూ ఒకరిద్దరైనా ఈ తెలుగు టైపింగ్ గురించి ఫోన్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే నివృత్తి చేసుకొని మీ చార్ట్ వల్ల, వీడియో వల్ల ఇంటి వద్దే సులభంగా తెలుగు టైపింగ్ నేర్చుకొంటున్నాం అని కృతజ్ఞతలు తెలియజేస్తుంటే చాలా సంతోషం అవుతుంది.

మనకు తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి పంచడంలో చాలా ఆనందం ఉంటుంది.

ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోఒక మలుపు ఉంటుంది మనం దాని నుంచి స్పూర్తి పొంది సమాజానికి ఉపయోగపడేలా మనవంతు ప్రయత్నం చేయాలి.

మనకు విద్యను అందుబాటులోకి తేవడానికి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, హక్కులు కల్పించడానికి మన మహనీయులు గౌతమ బుద్ధుడు, పూలే దంపతులు, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొదలైన వారు ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో పోరాటాలు చేసి వారి జీవితాలను సహితం త్యాగం చేసి మనకు ఈ అవకాశాలు కల్పించారు.

వారి స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో Payback to the society లో భాగంగా మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మాకు చాలా సంతృప్తినిస్తుంది.

జై భీమ్!

We are because They were!

0 comments:

Post a Comment


TRT UPDATES

View More

CCE UPDATES

TSPSC UPDATES

ADVERTISEMENT